మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Sri Guru Paduka Stotram – శ్రీ గురు పాదుకా స్తోత్రం


అనంతసంసారసముద్రతార-
నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం |
వైరాగ్యసామ్రాజ్యదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 1 ||

కవిత్వవారాశినిశాకరాభ్యాం
దౌర్భాగ్యదావాంబుదమాలికాభ్యామ్ |
దూరీకృతానమ్రవిపత్తితాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 2 ||

నతా యయోః శ్రీపతితాం సమీయుః
కదాచిదప్యాశు దరిద్రవర్యాః |
మూకాశ్చ వాచస్పతితాం హి తాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 3 ||

నాలీకనీకాశపదాహృతాభ్యాం
నానావిమోహాదినివారికాభ్యామ్ |
నమజ్జనాభీష్టతతిప్రదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 4 ||

నృపాలిమౌలివ్రజరత్నకాంతి-
సరిద్విరాజజ్ఝషకన్యకాభ్యామ్ |
నృపత్వదాభ్యాం నతలోకపంక్తేః
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 5 ||

పాపాంధకారార్కపరంపరాభ్యాం
తాపత్రయాహీంద్రఖగేశ్వరాభ్యామ్ |
జాడ్యాబ్ధిసంశోషణవాడవాభ్యామ్
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 6 ||

శమాదిషట్కప్రదవైభవాభ్యాం
సమాధిదానవ్రతదీక్షితాభ్యామ్ |
రమాధవాంఘ్రిస్థిరభక్తిదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 7 ||

స్వార్చాపరాణామఖిలేష్టదాభ్యాం
స్వాహాసహాయాక్షధురంధరాభ్యామ్ |
స్వాన్తాచ్ఛభావప్రదపూజనాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 8 ||

కామాదిసర్పవ్రజగారుడాభ్యాం
వివేకవైరాగ్యనిధిప్రదాభ్యామ్ |
బోధప్రదాభ్యాం ద్రుతమోక్షదాభ్యాం
నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ || 9 ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.